జీవితాన్ని మార్చేది చదువు.. ఆ చదువు ఇచ్చిన విజ్ఞానం మాత్రమే.. ఈ విషయాన్ని సీఏ చదివి.. అత్యుత్తమ శిఖరాల్ని అధిరోహించిన నెటిజన్ హరికృష్ణ ఎంబీ తన స్వానుభవం ద్వారా ఇలా చెబుతున్నారు..!

Hari krishna MB

నేను CA లో భాగం గా హైదరాబాద్ లో articles చేస్తున్నప్పుడు నాకున్న ప్రధాన లక్ష్యం - జీవితంలో rtc బస్సు ఎక్కాల్సిన అవసరం లేని విధం గా ఒక చిన్న ఉద్యోగం సంపాదించడం... ఇది 2005 ప్రాంతం లో.. దాదాపు 2008 నుంచి బస్సు పెద్దగా ఎక్కింది లేదు.. ( హైదరాబాద్ లో లోకల్ బస్సుల్లో ప్రయాణం మానవ హక్కులకు విరుద్ధం అని నా భావన).
 
రోజర్ ఫెడరర్ అని టాప్ టెన్నిస్ ప్లేయర్ కి ఇలాంటి ఒక లక్ష్యం ఉండేదట.. - జీవితాంతం ఫ్లైట్స్ లో బిజినెస్ క్లాస్ లో వెళ్లేంత సంపాదించడం... కేవలం టెన్నిస్ ప్రైజ్ మనీ నుంచి  అతను 975 కోట్లు సంపాదించాడు.. నేను అంత కాకపోయినా ఇంతకుముందు కంటే బెటర్ పోసిషన్ లో ఉన్నాను.
లక్ష్యాలు పెద్దవైతే సాధన కూడా పెద్దది కాగలదు. శ్రమ, పట్టుదల, self consciousness తోడైతే సాధించొచ్చు..

నేను ఇంటర్ లో CEC తీసుకున్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఎగతాళి చేసారు. ఆ తర్వాత డిగ్రీ లో కూడా.. CA కోచింగ్ కోసం విజయవాడ చెన్నై వెళ్ళినప్పుడు, నీకెందుకు CA అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు నా కెపాసిటీ.. బేసిక్ గా నేను చాలా ఇంటెలిజెంట్ (ఇందులో గర్వం కానీ స్వకుచమర్దనం ఏమీ లేవు)  కానీ నిరంతరం నేర్చుకుంటూనే ఉండడం అనే అలవాటు వల్ల నేను చదివింది CA అయినా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్, సప్లై చైన్ హెడ్ గా ఉన్నా కంపెనీ లో.

చేతిలోకి వచ్చిన పని ఏదైనా సరే, "ప్రతి కష్టం లో అవకాశం" చూడడం మాత్రమే అలవాటు చేసుకుంటే చాలు. నా జాబ్ వల్ల ప్రపంచం లో జరిగే ట్రేడ్ సప్లై చైన్ వ్యవహారం రెగ్యులర్ గా తెలుస్తూ ఉంటుంది... abundant information ఉంది ప్రపంచం లో తెలుసుకోవాలంటే... రోజూ ఒక కొత్త లెర్నింగ్.
కానీ వీటన్నింటికీ బేస్ చదువు మాత్రమే.. ఏది చదివినా బాగా చదవడమే... చదువు ఒక్క తరం లో నే కుటుంబ స్థితి ని మార్చెయ్యగలదు..

ఫార్వర్డ్ కులాలు,  బ్యాక్ వార్డ్ కులాలు - ఏ వర్గం అయినా సరే, మిగతా పోరాటాలు ఎన్ని చేస్తూ ఉన్నా, బాగా చదువుకుంటే అన్నీ అధిగమించొచ్చు, మిగతా వారికీ మంచి దారి చూపొచ్చు.
సరైన దారి లో వెళ్లి జీవితాన్ని కుటుంబాన్ని మంచి స్థితి లో నిలపాలంటే చదువు వల్ల మాత్రమే సాధ్యం. ఆ తర్వాత scale పెంచుకోవడం అనేది అవకాశాన్ని బట్టీ, ambition level ని బట్టీ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: