
ఈ ఏడాదికి సంబందించిన ట్యూషన్ ఫీజు ను 30 శాతం తగ్గిస్తూ గత అక్టోబర్ లో జారీ చేసిన జీఓ 57 అమలును సైతం న్యాయ స్థానం నిలిపివేసింది. ఇప్పుడు ఇచ్చే హైకోర్టు నిర్ణయాన్ని విద్యార్థులు తుది నిర్ణయం గా తీసుకోవాలని కోరింది. జీవో విషయమై ఇండింపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తరఫు లాయర్ ఫీజుల విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదని వాదనలు వినిపించారు. లాభార్జన లేకుండా వసూలు చేయకుండా ఉండడమే ప్రభుత్వం బాధ్యత అని సుప్రీం కోర్టు గుర్తు చేశారు.
ప్రస్తుతం ఏపీ లో స్కూళ్లు బంద్ చేసే ఆలోచన లేదని.. ఆన్ లైన్ క్లాస్ వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ప్రకటించింది. కానీ ఆ ప్రకటన తరువాతే స్కూళ్లలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్న విద్యాసంస్థలను మాత్రం మూసివేయక తప్పని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం చెప్పింది.డబ్బుల కోసం కొన్ని ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. భారీగా కరోనా కేసులు నమోదవుతుంటే.. బయటకు చెప్పకుండా ఎప్పటి లాగే స్కూళ్లు, కాలేజీలను నడుపుతున్నాయి.. ఈ విషయం విద్యార్థుల తల్లి దండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. మరి మున్ముందు ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేస్తుందో చూడాలి..