
లైన్ మెన్ ఉద్యోగాలకు అర్హతలు..
జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్(ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్ /ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్)లో ఉత్తీర్ణత సాధించాలి..
వయస్సు..
31.01.2021 నాటికి 18-35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..
ఎంపిక:
రాత పరీక్ష, రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్, మీటర్ రీడింగ్ టెస్టుల ద్వారా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష..
ఈ పరీక్ష లో మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి..
ఫిజికల్ టెస్ట్..
ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా.. 15 నిమిషాల వ్యవధిలో పోల్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించి.. పోల్ క్లైబింగ్‌లో విఫలమైతే ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తారు.
మీటర్ రీడింగ్..
రాత పరీక్షతోపాటు పోల్‌క్లైబింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో మీటర్ రీడింగ్ పరీక్షలకు పిలుస్తారు.
ఎంపిక తర్వాత
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15000 చొప్పున వేతనంగా అందిస్తారు. వీరు గ్రామ పంచాయతీ/వార్డులలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్/వార్డు సెక్రటేరియట్స్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది...
ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, అలాగే ఎస్సీ/ఎస్టీ వారు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి: 03.05.2021
వెబ్‌సైట్: www.apcpdcl.in