భారత దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాంక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. బ్యాంకు జాబ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈరోజు( ఏప్రిల్ 27) నుంచి మే 17 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

కాగా, ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 5 వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో కర్క్‌ పోస్టులతో పాటు క్లరికల్‌ క్యాడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో, మెయిన్స్ పరీక్ష జూలై 31న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు https://www.sbi.co.in/careers వెబ్‌సైట్‌ను చూడవచ్చు..

అర్హతలు:

ఏదైనా డిగ్రీ పాసయ్యి ఉండాలి..

వయస్సు: 20 నుంచి 28 ఏళ్ళ మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్‌ 2 నుంచి 2021, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ రాతపరీక్ష. పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్‌ అని రెండు విభాగాలుగా ఉంటుంది.

పరీక్ష విధానం

ప్రిలిమినరీ.. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నిర్ణీత సమయంలోపు సెక్షన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 మార్కులకు ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 70 మార్కులు ఉంటాయి. మూడు విభాగాలకు 20 నిమిషాల చొప్పున మొత్తం గంట సేపట్లో పరీక్ష రాయాలి..తప్పుడు సమాధానం రాస్తే 0.25 మార్క్ కట్ అవుతుంది.


మెయిన్‌: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయవచ్చు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వాటికి 200 మార్కులు కేటాయించారు. పరీక్షను 2.40 గంటల సమయంలో పూర్తిచేయాలి. జనరల్‌ లేదా ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌ (40 మార్కులు, 40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 మార్కులు, 50 ప్రశ్నలు), రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ (50 ప్రశ్నలు, 60 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు.

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 27
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌ లో
మెయిన్‌ ఎగ్జామ్‌: జూలై 31

పైన తెలిపిన వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: