ప్రభుత్వం ఇప్పుడు ఆర్దికంగా ఎలా లాభాలను పొందాలనే ఆలోచనతో ఉంది..అందుకే గత ఏడాది కరోనా సంక్షోభాన్ని పరిష్కరించటంలో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.. ఈ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను పూరించడం లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసింది. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు..


వివరాల్లోకి వెళితే... నిరుద్యోగులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థ తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక nhai.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులను ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే కేవలం గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు..


కాగా,అప్లికేషన్లకు ఆఖరి తేదీగా మే 28ని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు.


వయస్సు: 30 ఏళ్లు కలిగి ఉండాలి..

గేట్ -2021 లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అవసరమని భావిస్తే అభ్యర్థులకు ఇంటర్వ్యూలను కూడా నిర్ణయించే అధికారం సంస్థకు కు ఉంటుంది. కట్ ఆఫ్ మార్కులను కూడా ఎన్ హెచ్ఐకు ఉంటుంది...ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు పైన తెలిపిన వెబ్ సైట్ లో పూర్తి వివరాలను ఒకసారి చదివి తర్వాత అప్లై చేసుకోవచ్చు.. ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: