కొన్ని సార్లు నిరుద్యోగులకు శిక్షణ సైతం అందించి వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నారు అధికారులు. తాజాగా ప్రముఖ రిలయన్స్ జియో సంస్థ లో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ విభాగం లో ఈ ఖాళీల భర్తీ చేపట్టారు అధికారులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఉద్యోగాల కు ఎంపికైన వారికి నెల కు 12 వేలకు పైగా వేతనాన్ని కూడా అందిస్తున్నారు.
ఈ ఉద్యోగాల కు విద్యార్హతలు..
ఇంటర్ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాని కి అర్హులు. అభ్యర్థుల కు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలు వచ్చి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 19 నుంచి 30 ఏళ్ల మధ్య లో ఉండాలి. అభ్యర్థులు అండ్రాయిడ్ మొబైల్ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తో కూడిన ఆధార్ కార్డు, పాన్ కార్డును తప్పనిసరి గా కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు..
ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 24 లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థు లు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యం లో ఈ అవకాశం కల్పించారు.. పూర్తి వివరాల కోసం 8179541641 నంబరు కు కాల్ చేసి తెలుసుకోవచ్చు..