దరఖాస్తులు సంస్థ అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని, సంస్థ చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంది.
ఆయా విభాగాలలో ఖాళీలు ఇలా ఉన్నాయి. ఫిట్టర్ 85; మెషినిస్ట్ 31; మెకానిక్ 8; టర్నర్ 5; సిఎన్ సి ప్రోగ్రామింగ్ మరియు ఆపరేటర్ 23; ఎలక్ట్రీషియన్ 18; ఎలక్ట్రానిక్ మెకానిక్ 22.
దరఖాస్తు చివరి తేదీ నుండి 45 రోజుల లో ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. అనంతరం పది రోజులలో శిక్షణ ప్రారంభం అవుతుంది.
అర్హత : పదవతరగతి లో పాస్ అవడంతో పాటుగా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అవ్వాల్సి ఉంది.
స్టైఫండ్ : సిఎన్ సి ప్రోగ్రామింగ్ మరియు ఆపరేటర్ కు 10,899 రూపాయలు; మిగిలిన వారికి 12,261 రూపాయలు.
దరఖాస్తు రుసుము : 100 రూపాయలు. ఎస్టీ, ఎస్సి , మహిళలకు, దివ్యంగులకు రుసుము లేదు.
అధికారిక వెబ్ సైట్ : https://rwf.indianrailways.gov.in/
దరఖాస్తు పంపాల్సిన చిరునామా :
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
పర్సనల్ డిపార్ట్‌మెంట్,
రైల్ వీల్ ఫ్యాక్టరీ,
యెలహంక, బెంగళూరు- 560064.
గమనిక : దరఖాస్తు కు అవసరమైన పత్రాలు జతపరచాల్సి ఉంది. దరఖాస్తు కాపీని ఒకటి జిరాక్స్ తీసుకోని భవిష్యత్తు అవసరాలకు జాగర్త చేసుకోవాలి. దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంది.