
వివిధ కార్పోరేషన్ లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అములు చేయడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారు చుట్టిన ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరో అడుగు వేసింది. పాఠశాల తల్లితండ్రుల కమిటీల్లో రిజర్వేషన్ ను అమలు చేయాలని సూచించింది. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి తరగది గదిలోనూ ముగ్గురు తల్లితండ్రులు పాఠశాల కమిటీ లో సభ్యులుగా ఉండాలని చెప్పారు. ఆ ముగ్గురిలోనూ ఒకరు ఎస్సి సామాజిక వర్గానికి , మరోకరు ఎస్టీ సామాజిక వర్గానికి, మిగిన వ్యక్తులు బి.సి సామాజిక వర్గం వారై ఉండే లాా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు తప్పని సరిగా తల్లులై ఉండవాలని నిబంధన విధించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు ఓటు హక్కులేని ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. పాఠశాల కమిటీ ఛైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి. ఈ నిబంధనల మేరకు పాఠశాల కమిటీ ఎన్నికలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.