
వీరు సూపర్ హీరోయిన్ లు
ప్రపంచం అంతా నేడు (అక్టోబర్ 5) అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థధ యునెస్కో సూచన మేరకు 1994 నుంచి ఈ ఉత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారత్ మాత్రం టీచర్స్ డేని ఒక్క నెల ముందే నిర్వహించింది. ప్రతి ఏటా భారత్ లో సెప్టెంబర్ 5 న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. దివంగత భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మృత్యర్థం భారత దేశంలో ఏటా టీచర్స్ డే నిర్వహిస్తారు. విద్యా వ్యవస్థ పునరుద్ధరణ ఏడాది వరల్డ్ టీచర్స్ డే ధీమ్. భారత్ లో విద్యావ్యవస్థను గాడిలో పెట్టి , ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వారిని ఓ సారి గూర్తు చేసుకుందాం. వీరు సూపర్ హీరోయిన్ లు
సావిత్రీబాయ్ పూలే
తెలంగాణ మూలాలు కల్గిన సావిత్రీతబాయ్ పూలే భారత్ లో తొలి మహిళా ఉపాధ్యాయిని. ఈ ప్రాంతంతో ఆమెకు బంధుత్వం ఉంది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లోని నిజామాబాద్ జిల్లా లో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతం అంతా ఈమెకు చుట్టాలే , ఆమెకు తొమ్మది సంవత్సరాల వయసులో, తన కంటే మూడేళ్లు పెద్దవాడైన 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెతో 1840లో వివాహ మైంది. ఆమె తొలుత నిరక్షరాస్యురాలు
భర్త జ్యోతిరావు పూలే ఆమెకు తొలి గురువయ్యారు.అతని ప్రోత్సాహం తోనే ఇంటి వద్ద నుంచే విద్యనభ్యశించారు.అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1848 లో అణగారిన వర్గాల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇందుకు భర్త ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. మరలా తిరిగి ఆమె 1851 లో పాఠశాలను పునః ప్రారంభించారు. నాటి ప్రముఖులు మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి వారు పాఠశాల నిర్వహణకు సహకరించారు దీంతో ఆమె భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చరిత్రపుటల్లో నిలిచింది.
మనాబి బందోపాధ్యాయ
హిజ్రా.. ఈ పేరు వినగానే చాలామందికి అదో రకమైన వివక్షతతో కూడిన చిన్నచూపు, అంతే కాదు.. వారు అసలు మనుషులే కాదన్నట్టు ఛీత్కార స్వభావం. మేము ఎందులోనూ మిగతా వారికన్నా తక్కువా కాదని హిజ్రా లు నిరూపిస్తున్నారూ. భారత దేశపు మొట్టమొదటి హిజ్రా ప్రిన్సిపాల్ మనాలీ బందోపాధ్యాయ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా కాళాశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. ఈమె స్వగ్రామం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నైహతీ గ్రామం. హిజ్రాల జీవితం పై ఆమె పీ.హేచ్.డీ పొందారు. అంతే కాదు రచయిత కూడా. థియేటర్ ఆర్టిస్ట్‌గానూ సుప్రసిద్దురాలు , రచయిత్రిగా ఎండ్ లెస్ బాండేజ్ హిజ్రా అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం లక్షల కాపీలలకు పైగా అమ్ముడు పోయింది.