కేంద్ర ప్రభుత్వం సైన్యంలోనూ మహిళలకు అవకాశాలు కల్పిస్తోంది. దేశ రక్షణ రంగంలో ప్రవేశించటానికి వీలుకల్పించే ఎన్‌డీఏ పరీక్ష రాసేందుకు ఇప్పుడు మహిళలకు కూడా అవకాశం ఉంది. గతంలో కేవలం అబ్బాయిలకే ఈ పరీక్ష ఉండేది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం దిగివచ్చింది. సైన్యంలో మహిళలకూ అవకాశాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదో చారిత్రక తీర్పు.. ఈ తీర్పు తర్వాత తొలి నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఎన్‌డీఏ ప్రకటన డిసెంబరు 22న వెలువడబోతోంది.


ఈ నోటిఫికేషన్ ద్వారా కొలువుల అవకాశాల్లో, ఉద్యోగ ప్రయోజనాల్లో మహిళలకూ సముచిత భాగస్వామ్యం దొరుకుతుంది. సాధారణంగా మహిళలు ఇలాంటి సైన్యం ఉద్యోగాల వైపు అంతగా ఆసక్తి చూపరు.. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను ఈ రంగాలవైపు ప్రోత్సహించరు. కానీ.. కాలం మారుతోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మార్పుకు ఇదే సమయం. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కూడా ఇదే సరైన సమయం.. ఈ విషయాన్ని మహిళలు గుర్తించాల్సిన సమయం వచ్చింది.


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌నిర్వహించే ఈ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ పరీక్ష ద్వారా మహిళలు సైన్యంలో ప్రవేశించొచ్చు.. ఈ పరీక్షలు సంక్షిప్తంగా ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ అంటారు. ఇప్పటి వరకూ షార్ట్‌ సర్వీస్‌ పోస్టుల్లో ఎంపికైన పురుషులకే శాశ్వత కమిషన్‌లోకి అవకాశం ఉండేది. కానీ ఇకపై మహిళలకూ ఆ అవకాశం కల్పిస్తున్నారు.


nda and NA పరీక్ష ఏటా రెండు సార్లు ఉంటుంది. ఒక్కో విడతకు 400 మంది వరకూ అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో ఎంపికైన వారికి పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ చదువు, శిక్షణ ఏకకాలంలో ఇస్తారు. అంటే చదువుకుంటూనే ఉద్యోగ శిక్షణ కూడా పొందుతారు. ఈ ఎన్డీఏలో బీటెక్‌, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉంటాయి. శిక్షణ సమయంలో రూ. 56 వేల వరకూ స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ తర్వాత మొదటి నెల నుంచే లక్ష రూపాయలకుపైగానే జీతం వస్తుంది. సాహస మహిళలకు ఇది చక్కటి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

nda