
టీసీఎస్ కంపెనీ ఫ్రెషర్స్‌ని భారీ ఎత్తున నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సైతం పలు రకాల ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించింది టీసీఎస్. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో మరోసారి ముఖ్యంగా యువకులను ఎంకరేజ్ చేసే విధంగా ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సారి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా... ఇప్పటికే ఆసక్తి దారులు జాబ్ కోసం అప్లై చేసుకుంటున్నారు. డిగ్రీ పాస్ అయ్యి కంప్లీట్ అయిన వారు అలాగే చివరి సెమిస్టర్ చదువుతున్న వారు సైతం 2022 జనవరి 16 లోగా అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.
టీసీఎస్ కి అప్లికేషన్ పంప దలచినవారు https://www.tcs.com/careers/tcs-smart-hiring లింక్ ను ఓపెన్ చేసి అప్లై చేసుకునే అవకాశం ఉన్నది.
టీసీఎస్ కి అప్లై చేసుకునేవారు ఇక్కడ చెప్పబడిన విద్యార్హతలు కలిగి ఉండాలి అన్నది ముఖ్యమైన విషయం.
బీసీఎ, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బీ.ఎస్సీ మ్యాథ్, సీఎస్ వంటి డిగ్రీలు 50 శాతం లేదా అంత కన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయినవారు ఇందుకు అర్హులు. 2020, 2021లో పాసైనవారు సైతం అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయుటకు అర్హులే.