2002 నీట్ పీజీ పరీక్ష వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.. తాజాగా సుప్రీంకోర్టు లో నీట్ పీజీ ఎగ్జామ్ పై పిటిషన్ వేయగా పరీక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022 నిర్వహణ విషయంపై ఈ రోజు విచారణ సుప్రీంకోర్టులో జరగనుంది. మార్చి 12వ తేదీన ఈ నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. ఆరుగురు ఎమ్ బీ బీ ఎస్ విద్యార్థులు నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతూ ఈ పిటిషన్ ను దాఖలు చేయగా.. ఇక 2021 నీట్ పీజీ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష తేదీని వాయిదా వేయాలని ఆ విద్యార్థులు కోరారు..
ఇక మరొకవైపు నీట్ అనేది విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నందున తమిళనాడు అసెంబ్లీ లో కూడా నీట్ ఎగ్జామ్ కు వ్యతిరేకంగా బిల్ పాస్ చేయడం జరిగింది.. ఇంకొకవైపు ఇంటర్న్ షిప్ గడువు తేదీ కూడా పెంచాల్సిందిగా ఈ పిటిషన్లో విద్యార్థులు కోరారు.. ఇలా ఎందుకు కోరవలసి వచ్చింది అంటే.. ఇంటర్న్ షిప్ పీరియడ్ పూర్తి చేయలేక పోయినందున ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేదని అందుకే ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు కోరారు.. అసలు విషయం ఏమిటంటే ఇంటర్న్ షిప్ వాయిదా పడిందనే విషయాన్ని కూడా తెలియజేయకుండా పీజీ పరీక్షకు అనర్హులు అవుతున్నామనేది విద్యార్థుల వాదన.
కోవిడ్ కారణంగా వందలాది మంది విద్యార్థులకు ఇంటర్న్ షిప్ పీరియడ్ నిలిచిపోయిందని ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఏర్పడిందని వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. అంతే కాదు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయడమే కాకుండా ఇంటర్న్ షిప్ గడువు కూడా మే 31వ తేదీ వరకు పెంచాలని విద్యార్థులు కోరారు. సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుండగా పరీక్ష వాయిదా విషయం లో సుప్రీంకోర్టు కంటే ముందే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. సుమారుగా ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు పరీక్ష వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా.. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.