రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం పడి గాపులు కాస్తున్నారు అని చెప్పాలి. ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగాల భారతేహీ చేపడుతుందా అని సంవత్సరాలకు సంవత్సరాలు ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ మధ్య గత నెల రోజుల నుండి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వ విడుదల చేస్తూ వచ్చింది. అయితే ఆ ఉద్యోగాలు లక్షల్లో ఉన్న నిరుద్యోగులకు సరిపోవు అనే చెప్పాలి. అందుకోసం ఇంకా ఏమైనా నోటిఫికేషన్ లు వస్తాయా అని ఎదురు చుసిన వారికి ఇండియన్ కోస్టల్ గార్డ్ శాఖ ఒక తీపి వార్తను అందించింది. మరి ఆ వార్త ఏమిటో.. పూర్తి వివరాలను ఒకసారి చూదాం.

ఇండియన్ కోస్టల్ గార్డ్ కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను నిన్న సాయంత్రం విడుదల చేసింది. ఇందులో వివిధ విభాగాలకు చెందిన పోస్ట్ లు ఉన్నాయి.

అసిస్టెంట్ కమాండంట్ విభాగంలో గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ లు ఉన్నాయి. జనరల్ డ్యూటీ మరియు జనరల్ డ్యూటీ (పైలట్ / నావిగేటర్), జనరల్ డ్యూటీ (ఉమెన్/ఎస్ ఎస్ ఎ), టెక్నికల్ (ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్), కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సి పి ఎల్ - ఎస్ ఎస్ ఎ) మరియు 'లా' లాంటి పలు ఉద్యోగాల భర్తీకి ఇండియన్ కోస్టల్ గార్డ్ శ్రీకారం చుట్టింది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్స్ ఫిబ్రవరి 16 నుండి 26 తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు ఈ క్రింది విద్యార్హత కలిగి ఉండాలి

పదవ తరగతి, ఇంటర్మీడియేట్ మరియు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి.

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: