తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ ప్రభుత్వం పరీక్షల తేదీని నిర్వహించడం జరిగింది. అందుచేతనే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అలర్ట్ గా ఉండమని తెలియజేసింది. ఎగ్జామ్స్.. వచ్చే మే నెల నుంచి ప్రారంభం అవుతున్నట్టుగా S S C బోర్డు తెలియజేసింది. ఈ మేరకు చాలా వేగంగా పనులను కూడా ప్రారంభించినట్లు SSC బోర్డ్ తెలియజేసింది. త్వరలోనే పరీక్షలకు సంబంధించి ఒక షెడ్యూల్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ వర్గాల వారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ సమాచారాన్ని పంపించినట్టు గా తెలుస్తోంది.

అయితే తెలంగాణలో జరిగే టువంటి ఈ పరీక్షల విభాగానికి సంబంధించి అన్నిటినీ సర్కులర్ ను కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పూర్తి వివరాలతో కూడిన జాబితాను త్వరలోనే తెలియజేయ బోతున్నారట. ఈ విషయాన్ని ఆ జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తారు.. అంతేకాకుండా ఉపాధ్యాయులకు పదోతరగతి సిలబస్ ను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకోమని తెలియజేసినట్లు గా సమాచారం. అలాగే విద్యార్థులను కూడా ఈ పరీక్షలకు సర్వం సిద్ధం గా ఉండేలా చేయమని సూచించినట్లుగా తెలుస్తోంది.

కరోనా కారణంగా తగు జాగ్రత్తలను పాటిస్తూ ఈ పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు తెలంగాణ ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే నిజానికి పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉండాల్సి ఉంది.. కానీ ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి వల్ల ప్రతిరోజు ఎలా ఉంటుందో తెలియని నేపథ్యంలో.. కాస్త ఆలస్యంగా పదవ తరగతి ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఇలా వెంటవెంటనే నిర్వహించే విధంగా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఇకపోతే విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ కు ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలని.. అంతేకాదు చదివిన ప్రతి అంశాన్ని రివిజన్ చేసుకుంటూ గుర్తించుకొని పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సూచిస్తోంది. ఇక ఏది ఏమైనా విద్యార్థులు అలర్ట్ కావాలని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: