జరగబోయే 10వ తరగతి తెలంగాణ ఎగ్జామినేషన్స్ లో విద్యార్థులకు ఒక ఉపశమనం కలిగించారు రాష్ట్ర ప్రభుత్వం. వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చే విధంగా ప్రశ్నపత్రం ఉంటుందట.. ఆబ్జెక్టివ్ పార్ట్ లోని అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఏడాది పదో తరగతి పరీక్షలో 50 శాతం ఎంపిక ఉంటుందట. మోడల్ పేపర్ ను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ అండ్ ట్రేనింగ్ వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు తెలియజేశారు.

పదవతరగతి పరీక్షలు అన్ని సబ్జెక్టుల్లో మొత్తం సిలబస్లోని 70 శాతం మాత్రమే నిర్వహించబడతాయట. సాధారణ 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్ లలోనే పరీక్ష  నిర్వహించనున్నట్లు సమాచారం. మే 11వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్ -A, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిట్ కోర్స్.. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టు కాంపోజిట్ కోర్సుతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఇక పదవతరగతి పరీక్షలు తెలంగాణలో మే 17న సోషల్ స్టడీస్ పేపర్ తో ముగుస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక OSSC  మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఇందులో సంస్కృతం, అరబిక్ భాషలలో పరీక్షలు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది.

OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టు అలాగే ఎస్ఎస్సి ఒకేషనల్ థియరీ కోర్స్ వరుసగా మే 18 , 19, 20 తేదీల్లో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.. అన్ని సబ్జెక్టుల లోని ఆబ్జెక్టివ్ పేపర్లకు పరీక్ష చివరిగా 30 నిమిషాలలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇకపోతే తెలంగాణలో ఇప్పటివరకు 4.81 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.. ఇక తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యార్థులకు పదవతరగతి పరీక్షల్లో కొన్ని సడలింపులు జరిగినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: