ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్..APPSC డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసే వారికి హాల్ టికెట్ లను ఈ రోజున విడుదల చేసినట్లు ఏపీపీ ఎస్సీ సంస్థ వారు తెలియజేశారు. ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ లో వచ్చే నెల 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలుపబడింది. కాబట్టి అభ్యర్థులు పరీక్ష అన్న హాజరు అవ్వాలనుకునేవారు..https://psc.ap gov in/ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


కేవలం ఈ హాల్టికెట్స్ ఇక్కడ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.. ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కు నవంబర్ నెలలో మొత్తం మీద 87763 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.. వీరందరికీ వచ్చేనెల పరీక్షలు నిర్వహించనున్నారు. APPSC లో లాగిన్ పేజీ లో అందుబాటులో ఉన్నాయి హాల్ టికెట్స్. అడ్మిట్ కార్డు ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

అడ్మిట్ కార్డు లో పేర్కొన్న వివరాలు..
 అభ్యర్థుల పేరు, అభ్యర్థుల సంతకం & ఫొటో, పరీక్ష కేంద్రం, సమయము & తేదీ, పరీక్ష పేరు, రిజిస్ట్రేషన్ సంఖ్య, POTPRID నెంబర్లు కలవు.

APPSC డిపార్ట్మెంటల్ హాల్ టికెట్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే..

1). ముందుగా అధికారిక వెబ్సైట్ ..https:// psc.ap gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.

2). అలా వెళ్లిన తర్వాత డిపార్ట్మెంటల్ హాల్ టికెట్ అనే వాటి పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

3). ఇక ఆ తర్వాత లాగిన్ పూర్తి వివరాల అక్కడ నమోదు చేయాలి.

4). ఆ తరవాత అడ్మిట్ కార్డ్ అనే డౌన్లోడ్ అనే వాటి పైన క్లిక్ చేయాలి.

5). ఇక అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత పరీక్ష తేదీ, మన పూర్తి వివరాలను ఒకసారి చూసుకోవా లి.. ఆ తరువాత మనం ప్రింటవుట్ తీసుకోవాలి. అయితే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసే వారు ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్  ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: