తెలంగాణలో గడిచిన 2018-2019 సంవత్సరం లో మాత్రమే రెండు పదవ తరగతి బ్యాచ్ ల విద్యార్థులను పాస్ చేయడం జరిగింది. అందుకోసం విద్యార్థులు ఎటువంటి పరీక్ష కూడా రాయలేదు. అయితే అందుకోసం పరీక్షలు పెట్టాలని ఎంత ప్రయత్నించినా కూడా  కరోనా కారణంగా అది వర్కౌట్ కాలేకపోయింది. అయితే ఈ ఏడాది మే నెలలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఒక షెడ్యూల్ ను కూడా ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గడిచిన రెండు సంవత్సరాలుగా ఎటువంటి క్లాసులు కూడా జరగలేదు.

అయితే ఈ సంవత్సరం కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయి. అయితే షెడ్యూల్ ప్రకారం జనవరి 10వ తేదీ లోపు మాత్రమే సిలబస్ పూర్తి చేయవలసి ఉన్నా..సంక్రాంతి సెలవులు, మరేతర కారణాల చేత అయినా సరే ఈ నెలాఖరు లోపు పూర్తి సిలబస్ ను కంప్లీట్ చేయాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈసారి కూడా ఉపాధ్యాయులు లు పెద్దగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు.. దీంతో సిలబస్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం కూడా.. పదవతరగతి పరీక్షలు మార్చి నెలలో మొదలు అయ్యి.. ఏప్రిల్ నెలలో ముగిసేవి.

అయితే డిసెంబర్ నెల నుంచి..ఎడ్యుకేషనల్ డైరెక్టర్ ద్వారా దానికి సంబంధించిన ప్రణాళిక కూడా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పరీక్షల నిర్వహణపై ఎలాంటి ప్రణాళిక లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పై చదువుల కోసం పదవ తరగతి పరీక్షల మార్కులు తప్పనిసరి కాబట్టి బెనిఫిట్ మార్కులు తగ్గితే ఎలా అని చాలా గందరగోళంలో ఉన్నారు విద్యార్థులు. ఇక మార్చి నెలలో ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అని అందుకు సిద్ధంగా ఉండమని విద్యార్థులకు అధికారులు సూచించారు. కానీ పలుచోట్ల సిలబస్ పూర్తి కాలేదన్నట్లుగా సమాచారం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించగలరని విద్యార్థులు ఎవరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి స్పందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: