కరోనా తగ్గుముఖం పట్టాక.. ఇప్పుడు మళ్లీ సాఫ్ట్ వేర్ బూమ్ అందుకుంటోంది. మళ్లీ సాఫ్ట్ వేర్ సంస్థలున్నీ నియమాకాలతో బిజీగా మారాయి. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ కాప్‌జెమినీ ఈ ఏడాది కూడా భారత్‌లో 60వేల మందిని కొత్తగా నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ కాప్‌ జెమినిలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,25,000 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్'కి డిమాండ్ పెరగడంతో ఈ నియామకాలు చేపడుతోంది కాప్‌ జెమిని సంస్థ.


అనుభవం ఉన్న వారితోపాటు ఫ్రెషర్లకు కూడా ఈ సంస్థ అవకాశం కల్పిస్తోంది. కాప్‌ జెమినీ సంస్థ ఇండియాలో తన సేవలు విస్తరిస్తంది. క్లౌడ్  ఏఐ కోసం ఒక అకాడమీని ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థకు  ప్రస్తుతం ముంబయిలోని ఆఫీస్‌లో భారీగా ఖాళీ స్థలం ఉంది కూడా. ఇది కాప్‌జెమినీకి ఇండియాలోనే అతిపెద్ద డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా చెప్పుకోవచ్చు. కాప్ జెమినికి మిగిలిన చోట్ల కంపెనీకి ఉన్న సెంటర్లను కూడా పెంచుతున్నారు.


ఈ కారణాలతో కాప్ జెమినీలో నియామకాలు బాగా పెరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. కాప్‌జెమినీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగం మంది భారతీయులేనట. ప్రస్తుతం క్యాప్ జెమిని సంస్థ..  5జీ, క్వాంటం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై సంస్థ దృష్టి సారిస్తోంది. గతఏడాది ఈ కాప్ జెమిని సంస్థ  ఎరిక్సన్ భాగస్వామ్యంతో భారతదేశంలో 5జీ ల్యాబ్‌ను  ప్రారంభించింది. భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోని క్లయింట్లకు 5జీ రంగ సేవలు అందించేందుకు భారతీయ కంపెనీలతో కలసి పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొస్తున్నారు.


ఆ సంగతి అలా ఉంచితే.. క్వాంటం, 5జీ, మెటావర్స్ టెక్నాలజీల్లోనూ సేవలు అందించేందుకు కాప్ జెమిని ముందుకు వస్తోంది. కొత్త తరం టెక్నాలజీ నైపుణ్యాలు భారతదేశంలో చాలా ఉన్నాయంటున్న కాప్‌ జెమిని యాజమాన్యం.. ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తోంది. ఆల్‌ ద బెస్ట్ ఫర్ యంగ్ ఇండియా.


మరింత సమాచారం తెలుసుకోండి: