తెలంగాణలో భారీగా ఉద్యోగ నియామకాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉద్యోగాల కోసం పోటీ పడే వారి సంఖ్య కూడా లక్షల్లో ఉండబోతోంది. ఇలా పోటీ పడే వారిలో నిరుద్యోగులు, ఇప్పటికీ చదువుతున్నవారితో పాటు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉంటాయి. అయితే.. ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు తాము ఈ పోటీ పరీకలకు ప్రిపేర్ కాగలమా.. మన వల్ల అవుతుందా.. ఫుల్ టైమ్ ప్రిపేర్ అవుతున్నవాళ్లతో మనం పోటీ పడగలమా.. అన్న సందేహంతో ఉంటారు. ఈ సందేహం చాలా మందిని వెనక్కు లాగేస్తోంది.


జీవితంలో ఉన్నత అవకాశాలను అందుకోవాలని ఉన్నా..ఇలాంటి సందేహాలు వారి ఏకాగ్రతను దెబ్బ తీస్తాయి. అయితే.. ఊహాల్లో బతకడంతో పాటు వాస్తవికతను కూడా అంచనా వేసుకునే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇలా ఆలోచిస్తే.. ఉద్యోగం చేస్తూ కూడా ప్రిపర్ అయి విజయం సాధించిన వారు కూడా ఎందరో ఉంటారు. ఉద్యోగ పరీక్షల్లో విజయ సాధించాలంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు.


మరి చేయాల్సిందేమిటంటే.. సాధ్యమైనంత త్వరగా ప్రిపరేషన్ ప్రారంభించడం.. ఇంకా నోటిఫికేషనే రాలేదు కాబట్టి.. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం ఉంటుంది. మీనమేషాలు లెక్కబెట్టడం కంటే.. యుద్ధ రంగంలోకి దిగడమే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. ప్రామాణికమైన పుస్తకాలు.. ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.. నిర్ణీత సమయంలో రివిజన్ చేసుకోవడం వంటి వ్యూహాలు అనుసరిస్తే ఉద్యోగం చేసేవారు కూడా విజయం సాధించవచ్చు.


ఎంత ఉద్యోగం చేస్తున్నా.. రోజుకు ఐదు గంటల సమయం కచ్చితందా వీలు చేసుకోవాలి. ఇక వీకెండ్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇలా చేస్తే.. వారంలో కనీసం మీ చేతిలో 40 నుంచి 50 గంటలు ఉంటాయి. మీరు ఎంత త్వరగా ప్రిపేరషన్ మొదలు పెడితే అంత బాగా ప్రిపేర్ అవుతారు.. విజయం సాధిస్తారు. అందుకే సందేహాలు వదిలేసి ప్రిపరేషన్ ప్రారంభించండి. విజయం అందుకోండి. బెస్టాఫ్‌ లక్.

మరింత సమాచారం తెలుసుకోండి: