విద్య ఎవరి సొంతం కాదు.. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా  ఇక చదువుకోవాలనే ఆసక్తి ఉంటే ఎంతో విజ్ఞానం సంపాదించవచ్చ అయితే చదువు వయసుతో సంబంధం లేదు అని చెబుతూ ఉంటారు ఎంతోమంది. ఇది నిజమే అని నిరూపించారు ఇంకెంతో మంది. ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా యువ వయసులో ఉన్నప్పుడు చదువుకోలేని వారు. ఇక ఆ తర్వాత మాత్రం లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఇక చదువు మీద ఆసక్తితో వివిధ రకాల డిగ్రీలు పొందేందుకు చదువును కొనసాగించడం చూస్తూ ఉంటాం.  డిగ్రీ చదివిన వాళ్లు ఇక పై చదువులు చదవడం ఇక యువతతో పాటు ఎక్కడ భయం బెరుకు లేకుండా ఎవరు ఏమనుకుంటారో అని వెనకడుగు వేయకుండా పరీక్షలు రాయడం లాంటి వి కూడా చూస్తూ ఉంటాం.



 ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది వృద్ధాప్య వయసులో కూడా పట్టువీడని విక్రమార్కుడులా చనిపోయేటప్పుడు అయినా సరే బాగా చదువుకున్న వారిలా ప్రాణాలు వదలాలని భావించి చదువును కొనసాగించడం లాంటి ఘటనలు ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి 80 ఏళ్ల వయసులో అరుదైన ఘనతను సాధించాడు. అయితే అతను పెద్దగా చదువుకోలేదు ఏమో అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే అతను ఏకంగా లాయర్ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాడు. అదేంటి లాయర్ వృత్తి అంటే ఉన్నతమైన చదివే కదా మళ్లీ ఇంకా ఏం చదువుతున్నాడు అని అనుకుంటున్నారు కదా.


 అదంతా తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి. ఎనిమిది పదుల వయసులో కూడా చదువుపై ఉన్న మమకారాన్ని వదులుకోలేక ఇంకా ఎన్నో మాస్టర్స్ డిగ్రీలు పొందుతున్నాడు సదరు వ్యక్తి. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే జ్యోతిష్య శాస్త్రంలో ఎమ్ఏ చేస్తున్నారు ఎస్వి పురోహిత్ అనే వృద్ధుడు. ఇప్పటికే పొలిటికల్ సైన్స్, సోషియాలజీ,హిందీ, ఇంగ్లీష్, మహాత్మా గాంధీ శాంతి పరిశోధనలు, అనువాదం ఎడిటింగ్, ఎల్ ఎల్ బి, ఎల్ఎల్ ఎం, డిప్లమా ఇన్ సైబర్ లా, పీజీ, డిప్లమా ఇన్ జర్నలిజం లాంటి సబ్జెక్టులలో ఆయన మాస్టర్స్ చేసి అరుదైన ఘనత సాధించారు. అయినప్పటికీ ఇంకా చదువు మీద మక్కువతో ఇంకాఎన్నో విభాగాలలో మాస్టర్స్ చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: