తెలంగాణలో పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇటీవలే వచ్చింది. తాజాగా మరో రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. పోలీసు రవాణా విభాగం, ఎక్సైజ్‌ శాఖలో 677 కానిస్టేబుల్ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ వచ్చింది. ఎక్సైజ్‌ శాఖలో 614 పోస్టులు, పోలీసు రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్‌ పోస్టులు ఇచ్చారు. వీటికి మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇక ఈ పోస్టుల అర్హతల విషయానికి వస్తే.. ఎస్సై పోస్టులకు 2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకూడదు. సింపుల్‌గా చెప్పాలంటే.. 1997 జులై 2 కంటే ముందు పుట్టకూడదు.. 2001 జులై 1 తర్వాత పుట్టకూడదు. ఈ మధ్యలో వాళ్లే అర్హులు. ఈ ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపు ఉంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉండాలి. ఎస్సైతోపాటు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఓసీ, బీసీ స్థానిక అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజు కట్టాలి. అదే ఎస్సీ, ఎస్టీ స్థానికులైతే రూ.500 ఫీజు కట్టాలి. ఇక స్థానికేతరులైతే అన్ని కులాలవారూ రూ.1000 చెల్లించాలి.

 
ఇక కానిస్టేబుల్‌, ఫైర్‌మెన్‌, వార్డర్‌ ఉద్యోగాల విషయానికి వస్తే. వీటికి 2022 జులై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండాలి. అలాగే 22 ఏళ్లు దాటకూడదు. 2000 జులై 2 కంటే ముందు పుట్టకూడదు. 2004 జులై 1 తర్వాత పుట్టకూడదు. హోంగార్డులైతే..  రెండేళ్ల కాలంలో కనీసం 365 రోజులు విధులు చేసి ఇప్పటికీ కొనసాగుతున్నవారికి 40 ఏళ్ల వరకూ అవకాశం ఉంది. మహిళా కానిస్టేబుల్‌ , మహిళా వార్డర్లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి.


వితంతువులు, విడాకులు పొంది, మళ్లీ పెళ్లి చేసుకోని వారు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే 40 ఏళ్లు మించకూడదు. మిగిలిన అన్ని కులాల్లో 35 ఏళ్లు దాటకూడదు. ఇక చదువు విద్యార్హత ఇంటర్మీడియట్‌. ఓసీ, బీసీ స్థానికులైతే రూ.800 ఫీజు కట్టాలి. ఎస్సీ, ఎస్టీలయితే రూ.400 ఫీజు కట్టాలి. స్థానికేతరుతైలే కులాలతో సంబంధం లేకుండా రూ.800 కట్టాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: