క్యాంపస్‌ నియమాకాల్లో విజ్ఞాన్‌ సరికొత్త రికార్డు నమోదు చేసింది.  గుంటూరులోని విజ్ఞాన్స్‌  ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతూ ప్రాంగణ నియామకాల్లో ఈ ఏడాది 550 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ సాధఇంచారు. దీంతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ ఏడాది మొత్తం 550 మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధింస్తే.. వారి తల్లిదండ్రులను కాలేజి యాజమాన్యం సత్కరించింది. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు వెలకట్టలేనివని టీసీఎస్‌ సంస్థ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్‌ డెలివరీ హెడ్‌ కండూరి శ్రీనివాస రామానుజం ప్రశంసించారు.


నిరంతర సాధన, కృషి ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని టీసీఎస్‌ సంస్థ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్‌ డెలివరీ హెడ్‌ కండూరి శ్రీనివాస రామానుజం విద్యార్థులకు సూచించారు. మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులను జయించాలంటే విద్య ఒక్కటే మార్గమని టీసీఎస్‌ సంస్థ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్‌ డెలివరీ హెడ్‌ కండూరి శ్రీనివాస రామానుజం అభిప్రాయపడ్డారు. కొత్త సాంకేతికతను నేర్చుకునేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. డేటాబేస్‌. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ వంటి అంశాల్లో నైపుణ్యత సాధించాలని టీసీఎస్‌ సంస్థ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్‌ డెలివరీ హెడ్‌ కండూరి శ్రీనివాస రామానుజం సూచించారు.


విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాలకే పరిమితమవకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఐవోటీ, బిగ్‌డేటా, రోబోటిక్స్‌ లాంటి నూతన సాంకేతిక అంశాలను నేర్చుకోవాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య  సూచించారు. మంచి వ్యక్తిత్వం, సహనం, పట్టుదల, కష్టపడేతత్వం ఉన్న విద్యార్థులు జీవితంలో అందరికంటే ఉన్నతంగా ఎదుగుతారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య  పేర్కొన్నారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థలు మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో చక్కటి విద్యకు పునాదులు వేశాయి. ఎందరో విద్యార్థులను ఉన్నత మార్గాల్లో నడిపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: