ఒత్తిడికి గురై పోటీ పరీక్షలకు సరిగా సంసిద్ధం కాలేరు. ఇలాంటప్పుడు వారు తమ ఒత్తిడిని తగ్గించుకుంటే కానీ సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టి విజయాన్ని అందుకోలేరు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా.. అంటే మేదావులు ఈ విధంగా చెబుతున్నారు. విద్యార్థి ఎవరైనా... పరీక్ష ఏదైనా ముందుగా మీకు మీరు ప్రశాంతగా ఉండి.. దైర్యంగా అటెంప్ట్ చేయాలి. ఒత్తిడి పడితే ఒక పరీక్షల్లోనే కాదు ఎందులోనూ సక్సెస్ కాలేరు.
ఒత్తిడి అనేది తల్లితండ్రులు అలాగే ఇతరుల వలన కూడా పెరిగి అది విద్యార్థుల పై ప్రభావం చూపుతుంది. విజేతలకు పరాజితులకు ఉన్న తేడా చిన్నదే కానీ... దాని ఫలితంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. విద్యార్థుల భయం , వారి లో పట్టుదల కూడా కొన్నిసార్లు ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాయి. అలాగే తల్లిదండ్రుల అవగాహన లేమి, ఇతరులతో పోల్చే లక్షణం, అధ్యాపకుల వ్యవహార శైలి ఇవన్నీ కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతాయి. బావోద్వేగాలను అదుపు చేసుకోగలిగి... నమ్మకాన్ని కోల్పోకుండా గట్టిగా ప్రయత్నిస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు అంటున్నారు విద్యావేత్తలు.