ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆయన పెద్ద పీట వేస్తున్నారు.కరోనా వైరస్ లాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమానికే పెద్ద పీట వేశారు. ఆదాయం తగ్గుముఖం పట్టినా కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలలో జగనన్న విద్యాకానుక కూడా ఒకటి.విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని ఆయన అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5వ తేదీన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.జిల్లాలోని ఆదోనిలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్లు పంపిణీని చేయనున్నారు. విద్యార్ధులకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలను ఆయన అమలు చేస్తున్నారు. ఏపీలో జూలైలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా నుంచి ఆయన ప్రారంభించనున్నారు. ఇంకా అలాగే జగనన్న కానుక కిట్లలో విద్యార్థుల చదువుకు సంబంధించి అన్ని కూడా అందులోనే ఉంటాయి.


జగనన్న విద్యా కానుక కిట్లలో మూడు జతల యూనిఫామ్స్‌, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు ఇంకా అలాగే స్కూల్‌ బ్యాగ్‌ వంటివి ఉంటాయి. ఇంకా అలాగే బాలురకు స్కై బ్లూ రంగు ఇంకా బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. అలాగే యూనిఫామ్‌ కుట్టించుకునేందుకు మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా డబ్బులు చేస్తుంది జగన్ ప్రభుత్వం.ఇక ఏపీ సర్కార్‌ అందిస్తున్న జగనన్న విద్యా కానుక కింద ప్రయోజనం పొందాలని భావించే వారికి కొన్ని అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది.ఈ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలులో ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్‌ అనేది వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. వారికి ఉచితంగా కిట్లు అందిస్తారు. ఇంకా అలాగే చదువుకు సంబంధించిన అవసరమైన సామాగ్రి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: