ఇక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ విద్యార్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది..2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను కోరుతోంది.ఇందులో స్కూల్‌ పిల్లలకు, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఇంకా పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. అర్హత ఇంకా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31వ తేదీ దరఖాస్తులకు చివరితేది..ఆసక్తి ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఇక ఆలస్యం ఎందుకు వెంటనే అప్లై చేసుకోండి..దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ స్కూల్‌ ప్రోగ్రాంకి అర్హత విషయానికి వస్తే.. ఇందులో కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత ఉండాలి.స్కాలర్‌షిప్‌ అనేది 1-6వ తరగతి వరకు రూ.15,000, 7-12వ తరగతి వరకు మొత్తం రూ.18,000 చెల్లిస్తారు.ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాం అర్హత వచ్చేసి కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేన్‌ చదువుతున్న వారు అర్హులు.ఇంకా అలాగే 10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.స్కాలర్‌షిప్‌ డిప్లొమా వారికి రూ.20,000, అండర్‌ గ్రాడ్యుయేషన్‌-రూ.30,000 ఇంకా ప్రొఫెషనల్‌ కోర్సులు-రూ.50,000 చెల్లిస్తారు..


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ పీజీ ప్రోగ్రాం అర్హత విషయానికి వస్తే..కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.ఈ స్కాలర్‌షిప్‌ పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35,000 ఇంకా ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులు-రూ.75,000 చెల్లిస్తారు.


ఇక కీలక సమాచారం విషయానికి వస్తే..ఎంపిక విధానం వచ్చేసి అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఇక ఆ సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.అలాగే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఈ దరఖాస్తులకు చివరి తేది వచ్చేసి ఆగస్టు 31, 2022. ఇక పూర్తి సమాచారం కొరకు https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecs-scholarship ఓపెన్ చేసి చూడండి..




మరింత సమాచారం తెలుసుకోండి: