యూపీఎస్సీ కి అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌ (OTR) ఫెసిలిటీని ప్రారంభించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.ఇక ఈ OTR సదుపాయం ద్వారా అభ్యర్థులు UPSC వెబ్‌సైట్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఈ వివరాలతోనే ఏ జాబ్‌కు అయినా కూడా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు IAS, nda ఇంకా అలాగే ఇతర UPSC పరీక్షలకు అప్లై చేయాలనుకున్న ప్రతిసారీ తమ పూర్తి వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. OTR రిజిస్ట్రేషన్‌ సమయంలో నమోదు చేసిన వివరాలు, ఆ తర్వాత దరఖాస్తు చేసే ప్రతిసారి ఆటోమేటిక్‌గా ఫిల్‌ అవుతాయి. దీని ద్వారా అభ్యర్థి సమయం ఆదా అవుతుంది. అప్లికేషన్‌ లో వివరాలు తప్పుగా ఎంటర్ చేసే అవకాశాలు కూడా తగ్గుతాయి.


అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in లాంటి UPSC అధికారిక వెబ్‌సైట్లలో UPSC OTR సదుపాయాన్ని పొందవచ్చు. ఇక UPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అంటే అభ్యర్థుల సౌలభ్యం కోసం కమిషన్ ప్రారంభించిన సదుపాయం. అభ్యర్థులు UPSC ప్లాట్‌ఫారమ్‌లో ఒకసారి నమోదు చేసుకోవాలి. ఈ ఆధారాలు అన్ని UPSC పరీక్షలకు వర్తిస్తాయి. ఆ తర్వాత అభ్యర్థులు ఏదైనా పరీక్షకు అప్లై చేసేటప్పుడు ప్రతిసారీ పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదు. ఏదైనా UPSC పరీక్ష కోసం అభ్యర్థి దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ వివరాలు నమోదవుతాయి. దీనివల్ల తప్పులు దొర్లే అవకాశాలు అనేవి తగ్గుతాయి.


ఇక UPSC OTR ఎలా నమోదు చేసుకోవాలి అంటే?


ముందు అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.హోమ్‌పేజీలో, 'వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) ఫర్‌ UPSC ఎగ్జామ్స్‌' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.అభ్యర్థులు UPSC OTR రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త వెబ్‌పేజీ ఓపెన్‌ అవుతుంది.ఇందులో అవసరమైన వివరాలు నింపి OTR రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇప్పుడు ఇమెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్‌ ఉపయోగించి UPSC డ్యాష్‌బోర్డ్‌కి లాగిన్ అవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: