నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు సంబంధించిన ప్రకటనలను విడుదల చేస్తున్నారు అధికారులు.తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త చెప్పింది. రేపు అంటే సెప్టెంబర్ 3న ఏపీలో మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో నిర్వహించనున్నారు.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్  చేసుకోవాల్సి ఉంటుంది.ఖాళీలు, విద్యార్హతల వివరాల విషయానికి వస్తే..ఈ జాబ్ మేళా ద్వారా MSN Laboratories సంస్థలో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.


రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు MPDO Office, piduguralla, piduguralla (PO), (MD), Palnadu district చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.12 నెలల పాటు ట్రైనింగ్ పిరియడ్ ఉంటుంది. అలాగే మెడికల్ ఇంకా ఇన్సెంటీవ్స్ ఉంటాయి.ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలోఅభ్యర్థులు రెజ్యుమె, ఇతర అన్ని విద్యార్హతల సర్టిఫికేట్లు, టీసి ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.ఇంకా డౌట్ ఉంటే ఇతర పూర్తి వివరాలకు 7702700990 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హతలు వున్న నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: