చాలా మంది చదువుకొని డిగ్రీలు సంపాదిస్తారు. కానీ ఉద్యోగాలు మాత్రం కొందరికే వస్తున్నాయి. ఎందుకంటే వారిలో సరైన స్కిల్స్ అనేవి లేకపోవడం దానికి ప్రధాన కారణం.స్కిల్స్ ఉంటే జాబ్ రావడం పక్కా. స్కిల్స్ లేక డిగ్రీలు వున్నా ఉద్యోగాలు రావట్లేదు చాలా మందికి. ఇక టెక్నాలజీ విషయంలో దేశంలో ఎంతో అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొత్త టెక్నాలజీని అందిపుచ్చకోవాలంటే అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు కూడా ఉండాలి.అయిత దేశంలో ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉందో తెలిపేందుకు లింక్డ్ ఇన్ ఓ రిపోర్టుని కూడా విడుదల చేసింది.డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను నేర్చుకోవడంతో మంచి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ తరహా నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం, వారి కెరీర్‌కు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో.. 'స్కిల్స్‌ ఎవల్యూషన్‌ 2022', 'ఫ్యూచర్‌ ఆఫ్‌ స్కిల్స్‌ 2022' డేటాను లింక్డ్‌ఇన్‌ వెల్లడించింది. 


లింక్డ్‌ఇన్‌కు భారత్‌లో 9.2 కోట్ల మంది సబ్ స్రైబర్స్ ఉన్నారు.బిజినెస్‌ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్‌క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్‌ మేనేజ్‌మెంట్, మైక్రోసాఫ్ట్‌ అజూర్, స్ప్రింగ్‌బూట్‌ కు మంచి డిమాండ్ ఉందని లింక్డ్ ఇన్ పేర్కొంది. ఫైనాన్షియల్‌ రంగంలో.. జీఎస్‌టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపింది.ప్రస్తుతం మీడియా, ఓటీటీలు, వీడియో స్ట్రీమింగ్ విస్తరిస్తున్న క్రమంలో సెర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో), వెబ్‌ కంటెంట్‌ రైటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్‌ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్‌ ఇంజన్‌ మార్కెటింగ్‌ కు డిమాండ్ ఉన్నట్లు వివరించింది. సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి గాను ఆరు నైపుణ్యాలకు డిమాండ్ ఉన్నట్లు పేర్కొంది. క్లౌడ్ టెక్నాలజీ దేశంలో చాలా స్పీడ్ గా విస్తరిస్తోంది.ఈ స్కిల్స్ ఉంటే జాబ్ రావడం పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి: