ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  తాజాగా ఫేక్ యూనివర్సిటీల కొత్త జాబితాను విడుదల చేసింది.ఇంకా అలాగే దీంతో పాటు ఈ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ నకిలీ యూనివర్సిటీలను కమిషన్ ఎలా గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటుందన్న కొన్ని ప్రశ్నలకు యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ సమాధానమిచ్చారు.నకిలీ విశ్వవిద్యాలయం అంటే ఏమిటంటే..ఈ ప్రశ్నపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ యూజీసీ చట్టం ప్రకారం ఏర్పాటు చేయని ఏ సంస్థ అయినా లేదా యూనివర్సిటీలు అయినా నకిలీ కిందకే వస్తాయి. యూనివర్సిటీలకు ప్రభుత్వం విధించిన షరతులను ఉల్లంఘించి డిగ్రీలు ప్రదానం చేసినా నకిలీ సంస్థలేనన్నారు.UGC నకిలీ విశ్వవిద్యాలయాలను ఎలా గుర్తిస్తుందంటే..నకిలీ విశ్వవిద్యాలయాలను ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా UGC దృష్టికి వస్తాయి. పబ్లిక్ లేదా విద్యార్థుల నుండి ఫిర్యాదుల స్వీకరణ, రాష్ట్రం/UT/స్థానిక అధికారుల నుండి సూచనలు, కోర్టు నిర్ణయాలు మొదలగు వాటి ద్వారా తాము తనిఖిలు చేపడతామన్నారు. 


UGC  యాంటీ మాల్‌ప్రాక్టీస్ సెల్ (AMPC) 30 మే 1996 నుండి పనిచేస్తోందని.. ఇది నకిలీ యూనివర్సిటీలు, డిగ్రీల బెడదను అరికట్టడమే దీని లక్ష్యం అని పేర్కొన్నారు.UGC చట్టాన్ని ఉల్లంఘిస్తూ నడుస్తున్న నకిలీ లేదా గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు/సంస్థలకు సంబంధించిన అన్ని విషయాలతో AMPC వ్యవహరిస్తోంది. AMPC నకిలీ మరియు గుర్తింపు లేని సంస్థలను తనిఖీ చేయడానికి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ఏజెన్సీలతో అనుసంధానం చేస్తుంది. UGC చట్టం , ఇతర శిక్షా చట్టాలను ఉల్లంఘించినందుకు అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/UTలు అండ్ స్థానిక అధికారులను కూడా అభ్యర్థిస్తుంది.నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా తెలుసుకోవాలంటే ఇలా చెయ్యండి..ప్రస్తుతం UGC రూపొందించిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలో 21 నకిలీ విశ్వవిద్యాలయాలు/సంస్థలు ఉన్నాయి. ఇది అధికారిక వెబ్‌సైట్ https://www.ugc.ac.in/page/Fake-Universities.aspx లో కూడా అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: