చాలా మంది విద్యార్థులు కుటుంబ కారణాల వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్లనో చదువును మధ్యలో ఆపేసి ఉద్యోగాల వేట లో పడతారు.తక్కువ వేతనం అయినా పర్వాలేదు.. ఉద్యోగం అవసరం అనే కోణంలో చాలా మంది ఉన్నారు.అర్హతను బట్టి జీతంలో మార్పు ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని అత్యధిక వేతనం పొంతే రంగాల గురించి తెలుసుకుందాం..భారతదేశంలో ఉద్యోగాలకు కొదవలేదు. కానీ కొన్ని రంగాలకు ఉన్నత విద్యావంతులు , శారీరకంగా దృఢమైన యువత అవసరం ఉంటుంది.. ఇకపోతే ఎటువంటి రంగాల్లో వుంటే మంచి జీతంతో పాటు గౌరవం కూడా పొందవచ్చు. అనే విషయాల గురించి ఇప్పుడు చుద్దాము..


కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్..

కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మరియు ఫేస్‌బుక్ వంటి టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకుంటాయి. అనుభవం లేని ఇంజనీర్‌కు సాధారణంగా వార్షిక వేతనం రూ.5లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటుంది.

పైలట్..

కమర్షియల్ పైలట్ ఉద్యోగం అంటే నెలకు మంచి జతం సంపాదించుకోవడమే కాదు.. దానితో పాటు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. వీరికి నెలకు ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల జీతం లభిస్తుంది.

డాక్టర్..

దేశంలో డాక్టర్, ఇంజనీర్ రెండు సాంప్రదాయ వృత్తులు. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కాబట్టి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కూడా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు..అంతేకాదు ఈ వృత్తికి ఇతర దేశాల లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది.. సీటు రాకున్నా కూడా ప్రత్యేక ఫీజులు కట్టి మరీ చదువుతారు.

చార్టర్డ్ అకౌంటెంట్..

చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తికి ఎప్పటికైనా గుర్తింపు అనేది ఉంటుంది. ప్రతి కంపెనీకి CA అనేది అవసరం ఉంటుంది. మొదటి ప్రయత్నంలో CA ఫైనల్ క్లియర్ చేసిన వ్యక్తులు సంవత్సరానికి రూ. 11-15 లక్షల జీతం పొందుతారు..
ఈ ఉద్యోగాలకు సంభందించి మంచి డిమాండ్ తో సమాజంలో కూడా గౌరవం కూడా ఉంటుంది.. మన దేశంలో మాత్రమే కాదు ఇతర దేశాలలో కూడా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: