నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NCERTలో ఉద్యోగాలు?


నిరుద్యోగులకు శుభవార్త..నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే దేశంలోని పలు యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.అజ్‌మేర్‌, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్‌లలో ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ యూనిట్లలో ఉన్న అకడమిక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


భర్తీ చేయనున్న ఖాళీలు ఇంకా అలాగే అర్హతల విషయానికి వస్తే.. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 292 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఆఫీస్ మేనేజ్‌మెంట్/ స్టెనోగ్రఫీ పోస్టులను భర్తీ చేయనున్నారు.సైకాలజీ, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్, చైల్డ్ డెవలప్‌మెంట్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, హిస్టరీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టడీస్, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, సంస్కృతం, కన్నడ, ఒడియా సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. 


పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్‌, స్లెట్‌, సెట్‌ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.ముఖ్యమైన విషయాలు ఏంటంటే..ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.ప్రొఫెసర్/ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఖాళీలకు రూ.57,700 అందిస్తారు.ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 28-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత వున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.కాబట్టి ఖాళీగా వున్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: