నిరుద్యోగులకు మెక్‌డొనాల్డ్స్‌ గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు?

ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా కూడా ఉద్యోగుల తొలగింపు మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఆర్థికమాంద్యం నేపథ్యంలో చాలా కంపెనీలు కూడా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వస్తున్న నేపథ్యంలో అంతటా కూడా చాలా భయాందోళనలు నెలకొన్నాయి.అయితే ఇక ఇలాంటి తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ మెక్‌డొనాల్డ్స్‌ ఇండియాలో రానున్న మూడు సంవత్సరాలలో కొత్తగా 5000 మంది ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇండియాలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కొత్తగా 300 స్టోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు గౌహతిలో ఇండియాలో అతిపెద్ద రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఇక ఇది 6,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి మొత్తం 220 మందికి ఆహారం అందించగలదు.ఇంకా ఈ విషయం గురించి మెక్‌డొనాల్డ్స్ ఇండియా (నార్త్ అండ్ ఈస్ట్) మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. ‘మా కంపెనీ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో స్టోర్‌ల సంఖ్య పెంచేందుకు ప్లాన్ చేస్తున్నామ’ని తెలిపారు. 


మెక్ డొనాల్డ్ ఎంఎంజి గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ అగర్వాల్‌ను ఉత్తర ఇంకా తూర్పు భారతదేశంలో అవుట్‌లెట్లను పెట్టడానికి తన కొత్త భాగస్వామిగా ఎంపిక చేసింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నార్త్‌, ఈస్ట్‌ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్‌ మొత్తం 156 రెస్టారెంట్లను పెట్టనుంది. ఇక రాబోయే మూడేళ్లలో ఈ అవుట్‌లెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కూడా చూస్తున్నారు.ఉద్యోగుల సంఖ్య మూడు సంవత్సరాలలో రెట్టింపు అవుతుందని మెక్‌డొనాల్డ్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక మెక్‌డొనాల్డ్స్‌ కొత్త స్టోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాలు నిండినవారై ఉండాలి.అలాగే ఖచ్చితంగా మల్టీటాస్క్‌ చేసే నైపుణ్యం ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఇంకా అలాగే కస్టమర్ సర్వీస్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.ఇక అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: