
ఇంకా ఈ పోస్టుల ఖాళీల వివరాల విషయానికి వస్తే..
మొత్తం పోస్ట్లు - 1,675 వున్నాయి.
సెక్యూరిటీ అసిస్టెంట్ - 1525 పోస్టులు వున్నాయి.
MTS - 150 పోస్టులు వున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో 07 ఇంకా హైదరాబాద్ లో మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే..
ఆన్లైన్ అప్లికేషన్ తేదీ - 28 జనవరి 2023
అప్లై చేయడానికి చివరి తేదీ - 17 ఫిబ్రవరి 2023
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే..
ఈ పోస్టులకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలి. అభ్యర్థుల పరిమితి MTSకి 18-25 సంవత్సరాలు ఉండాలి. అలాగే SA/EXE పోస్టులకు 27 సంవత్సరాలు ఉండాలి. ఇక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయితే వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇంకా ఈ వయోపరిమితిని నిర్ణయించడానికి కటాఫ్ తేదీ అప్లికేషన్ కి చివరి తేదీ ఫిబ్రవరి 17.ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.50 చెల్లించాలి. ఇంకా అలాగే దీనితో పాటు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా మొత్తం 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ రిక్రూట్మెంట్కు సెలెక్ట్ కావడానికి అభ్యర్థులు టైర్ 1, టైర్ 2 పరీక్షలను రాయాలి. టైర్ 1 పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. ఇక టైర్ 2 పరీక్ష ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించబడుతుంది.సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 3 ప్రకారం రూ.69,010 వరకు చెల్లించబడుతుంది. అలాగే ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18 వేల నుంచి రూ.56,900 చెల్లిస్తారు.