తెలంగాణ: నిరుద్యోగుల కొరకు ప్రభుత్వ ఉద్యోగాలు?

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో మొత్తం 1601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది.అర్హత ఇంకా అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు తెలిపిన పోస్టులకు అప్లై చేసుకోండి. ఇక వీటిల్లో మొత్తం 1553 జూనియర్‌ లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మంగళవారం నాడు (జనవరి 31) మింట్‌ కాంపౌండ్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస (టీఈఈజాక్‌) కన్వీనర్‌ ఎన్‌ శివాజీ నేతృత్వంలో పలువురు జనవరి 31 వ తేదీన మంత్రిని కలిసి పీఆర్సీపై విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది.


ఇంకా అలాగే ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పు, ట్రాన్స్‌కో, జెన్‌కోలలో మొత్తం 166 మంది ఇంజినీర్ల రివర్షన్‌ అంశాలనూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రివర్షన్‌ అయిన వారిని సర్దుబాటు చేయడానికి ఉన్న అవకాశాలను మంత్రికి చాలా వివరంగా తెలియజేశారు.ఇక అంతేగాక విద్యుత్తు ఇంజినీర్లలో ఏ ఒక్కరికీ అన్యాయం అనేది జరగనివ్వమని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించి చర్యలు  కూడా చేపడతామని ఆయన తెలిపారు.అలాగే తెలంగాణ స్టేట్‌ జుడీషియల్‌ సర్వీస్‌ కింద  జూనియర్‌ సివిల్‌ జడ్జీల పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ ని విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10 జడ్జి పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.అర్హత ఇంకా అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: