చాలా మంది యువతకి పెద్ద గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని కల. అలాంటి వారి కోసం ఇప్పుడు అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చేసింది.ఇండియన్ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఉన్న మొత్తం ఇంజనీర్‌ పోస్టులని భర్తీ చేయనుంది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్ ఇంకా ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఇందులో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


భర్తీ చేయనున్న ఖాళీలు ఇంకా అర్హతల విషయానికి వస్తే..ఇక నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 303 సైంటిస్ట్‌/ఇంజనీర్‌ (ఎస్‌సీ) ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఇక వీటిలో ఎలక్ట్రానిక్స్ (90), కంప్యూటర్ సైన్స్ (47), ఎలక్ట్రానిక్స్ అటానమస్ బాడీ- పీఆర్ఎల్ (2) ఇంకా అలాగే కంప్యూటర్ సైన్స్ అటానమస్ -పీఆర్ఎల్ (1) ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఇక పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఖచ్చితంగా కనీసం 65 శాతం మార్కులతో బీఈ ఇంకా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.


ఇక అభ్యర్థుల వయసు విషయానికి వస్తే..జూన్ 14, 2023 నాటికి వారికి 28 ఏళ్లకు మించకూడదు.ఇక ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అయితే ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.అలాగే ఎంపికైన అభ్యర్థులకు నెలకు మొత్తం రూ. 56,100 ప్రారంభ జీతంగా ఇస్తారు.ఇక ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది మే 25 వ తేదీన మొదలై జూన్‌ 14వ తేదీతో ముగుస్తుంది.కాబట్టి ఈ పోస్టులకి ఆసక్తి ఇంకా అర్హత వున్న అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: