కానీ వారు కాస్త వయసు పెరిగిన తర్వాత కూడా ఇప్పుడేం చదువుతాంలే అని వెనకడుగు వేయకుండా.. పట్టుదల తో శ్రమించి ఇక చదువును కొనసాగించి మంచి మార్కులు సాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఇదే చేసి నిరూపించింది. ఆమె కొడుకు 12వ తరగతి చదువుతున్నాడు. అయితే కొడుకు తో పాటే ఆమె కూడా 12వ తరగతి చదివింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో తల్లి కొడుకులిద్దరు కూడా పరీక్షలు రాశారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. కొడుకు కంటే తల్లికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పాలి.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో వేలుగు లోకి వచ్చింది. 12వ తరగతి పరీక్షల్లో తల్లి కొడుకు ఒకేసారి పాసయ్యారు. 38 ఏళ్ల లతిక ఆర్థిక ఇబ్బందులతో ఆరో తరగతి లోనే చదువును ఆపేసింది. పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చదువుపై ఉన్న ఆసక్తితో పిల్లలకు పాఠాలు చెబుతూ తాను కూడా చదువుకొని కొనసాగించింది. అయితే కుమారుడు సౌరవ్ తో కలిసి ఇటీవల ఎగ్జామ్స్ రాయగా.. లతీకకు 500 కు 324 మార్కులు వస్తే కుమారుడికి 284 మార్కులు వచ్చాయి. ఇలా కొడుకు కంటే ఎక్కువ మార్కులు సాధించింది ఆ మహిళమని.