తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష నిర్వహణకు ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.టెట్‌ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నెల 27వ తేదీన పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.. ఈ క్రమంలోనే పరీక్షకు సంబంధించి విద్యాశాఖ కొన్ని ముఖ్య సూచనలను జారీ చేసింది. ఎగ్జామ్‌ సెంటర్‌ అడ్రస్‌ని ఒక రోజు ముందుగానే అభ్యర్థులు చూసుకోవాలని తెలిపింది. ఎగ్జామ్‌ హాల్‌లోకి హాల్‌ టికెట్‌ తప్ప మరి ఏ ఇతర వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకుకూడదని తెలియజేసింది.. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులో వివరాలను సరి చూసుకోవాలి. హాల్‌టికెట్‌పై ఫొటో, సిగ్నేచర్‌ సరిగ్గా లేకపోతే అభ్యర్థులు.. ఫొటోను అతికించి గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకొని, ఆధార్‌ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలని తెలియజేసింది.. డీఈవో అనుమతి ఇచ్చినాకే పరీక్షకు పర్మిషన్‌ ఇవ్వడంలో తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.

ఎగ్జామ్ కు గంట ముందే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతి ఇస్తారు. అభ్యర్థి పేరులో  దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, డిసేబిలిటీ వంటి వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని తెలియజేసింది.మొదటి పేపర్ పరీక్షకు సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు. సాయంత్రం పరీక్షకు సంబంధించి 5 తర్వాత మాత్రమే హాల్ నుంచి అభ్యర్థులను బయటికి అనుమతిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్ష హాలులోకి అనుమతి ఉండదు. పరీక్షా హాల్‌లో ఇబ్బందులు సృష్టిస్తే అలాంటి అభ్యర్థులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం 2,83,620 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి దాదాపు 1,82,260 దరఖాస్తులు వచ్చాయి

మరింత సమాచారం తెలుసుకోండి: