వంద మంది హిందువుల మధ్య ముస్లింలు, క్రైస్తవులు నిర్భయంగా బతుకుతున్నారు.  హిందూదేశమైన మన దగ్గర ఇతర మతస్థులు ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. అదే ఇతర మతస్థుల మధ్య హిందువులు ఈ విధంగా జీవనం సాగించగలరా అంటే ప్రశ్నార్థకమే. ఎవరి మతాలను వారు ఆచరించడంలో తప్పు లేదు. పరమత సహనం అనేది హిందుత్వం లో ఉన్న గొప్పతనం.


కానీ పరమత సహనం, పర ధర్మ సహనం కొంతమంది చేతకానీతనంగా తీసుకొని అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేది హిందువులు, యూదులు. ప్రస్తుతం ఈ అంశం ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నది అరబ్ ముస్లిం దేశాలే. ఇన్ని చుట్టూ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ ను వాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. అలా ఉంచరు. ఇప్పటికీ ఇజ్రాయెల్ 20-30 సార్లు యుద్ధాలు చేసింది. ఆ దేశాన్ని లేకుండా చేసి ముస్లిం భూ భాగంలో కలుపు కోవాలని అరబ్ దేశాలు ఎప్పటినుంచో చూస్తున్నాయి. ఇజ్రాయెల్ లో మత రాజ్య స్థాపన కోసం అనేక దారుణాలు చేస్తున్నారు.


పర మతస్థులు ఉంటే వాళ్లని బలవంత పెట్టి, దాడులు చేసో..లేక అత్యాచారాలు చేసి.. మత మార్పిడి చేయాలి. మాట వినకుంటే చంపేయాలనే మధ్య యుగపు నాటి అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఓ మత పెద్ద ఇజ్రాయెల్ లో మత రాజ్య స్థాపన చేసి దానిని ముస్లిం దేశంగా మార్చుతామని ప్రకటన చేశారు.


ఆ తర్వాత యూరప్, స్పెయిన్ లను ఆక్రమించుకొని అక్కడ కూడా మత మార్పిడులు చేసి ముస్లిం దేశంగా మారుస్తాం. ఆ తర్వాత తమ తదుపరి లక్ష్యం రోమ్ అని బహిరంగ ప్రకటనల చేశాడు. మత రాజ్య స్థాపన గురించి ఆయా మత పెద్దలు ఇంటర్వ్యూలు ఇస్తూ రెచ్చగొడుతూ ఉంటారు. మళ్లీ వీళ్లు భారత్ గురించి మాట్లాడుతుంటారు. సహనం ఉన్న దేశాలను లేదని.. లేని దేశాలని సహనపరులుగా చిత్రీకరిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: