మరోవైపు, గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సిలబస్లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల అభ్యర్థనల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న వేళ ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయించాలని కోరుతూ పలు జిల్లాల్లోని అభ్యర్థులు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలిస్తున్నారు. కొత్త సిలబస్ దృష్ట్యా గ్రూప్-2 మెయిన్స్ రెండు నెలలు వాయిదా వేయాలని MLCలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు ఫిబ్రవరి 7న లేఖ రాయగా సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు మరోసారి లేఖ రాశారు. గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలన్న విజ్ఞప్తులను ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది.