తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ సీట్లు హాట్ కేకులను తలపిస్తున్నాయి. ఈసారి కూడా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు.  మొదటి విడతలో భాగంగా 75200 సీట్లు కేటాయించారు. మొదటి విడత పూర్తైన తర్వాత మిగిలిన 3494 సీట్లు కేటాయించనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు జులై 23 లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ తెలిపారు.  ఓ సారి అప్లై చేసిన కోర్సులను పరిశీలిస్తే.. కంప్యూటర్ కోర్సు 99.31 శాతం, మెకానికల్ 71.54, సివిల్ 80.06, ఈఈఈలో 80.88శాతం కేటాయించినట్లు వివరించారు.


నేటి కాలంలో చాలా మంది యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరికొందరు ఐటీ జాబ్ కోసం ఎదురు చుస్తూ ఉంటారు. అంతే కాదు సాఫ్ట్ వేర్ రంగంపై యువతలో ఎక్కువగా ఆసక్తి ఉంది. అందుకే ఐటీ సెక్టార్ పై జాబులు పొందేందుకు చూస్తుంటారు.


అందుకే ఇంజినీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ కే మొగ్గు చూపుతున్నారు.  అందుకే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగింది.  దీనికి కారణం ప్రజల్లో ఒక విధమైన ఆలోచన. సాఫ్ట్ వేర్ అంటే వారానికి ఐదు రోజులే పని, వీకెండ్ పార్టీలు ఉంటాయి.  శని , ఆది వారం సెలవులు, చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ పని చేస్తుంటారు. సొసైటీలో గౌరవంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పవచ్చు. పైగా జీతాలు కూడా బాగానే ఉంటాయి.


ఈ కారణాలతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సాఫ్ట్ వేర్లు కావాలని కోరకుంటున్నారు. మరి వీరందరికీ ఐటీ ఉద్యోగాలు సాధ్యమా అంటే కాదు. వందలో పది మందికి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే.. మరో పది మందికి సాధారణ ఉద్యోగాలు వస్తాయి. మిగతా 80శాతం మంది వేరే జాబులు చేసుకోవాల్సిందే.  కానీ హార్డ్ వేర్ లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులు గుర్తించలేకపోతున్నారు అని చెప్పడానికి ఉదాహరణే ఇంజినీరింగ్ సీట్ల భర్తీ.

మరింత సమాచారం తెలుసుకోండి: