ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. రెండు పరీక్షలకు కలిపి ఇక మొత్తంగా 4,27,300  లక్షల మంది వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో మాదిరిగా టెట్‌ ప‌రీక్ష సీబీటీ విధానంలో ఆన్‌లైన్‌ లోనే నిర్వహించనున్నది. గతం లో ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్‌ 19 నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు ప్రారంభం కానున్నాయి.పేపర్‌-1 (ఎ) సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ విభాగంలో 1,82,609మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పేపర్‌-2 సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 1- బికు 2,662 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే.. సోషల్‌ స్టడీస్‌కు సంబంధించి 70,767మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 2-బి విభాగంలో 2,438మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ టెట్ హాల్ టికెట్స్ 2024ని కూడా పరీక్షకు వారం ముందు విడుదల చేయనున్నారు.గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు పరీక్షలు నిర్వహిస్తామని.. అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటన లో వెల్లడించారు.డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు పోటీపడుతున్నవారి సంఖ్య భారీగా ఉంది. రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీకి సిద్ధమైన ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.16,347 టీచర్‌ పోస్టులకు జులై 1వ తేదీ DSC 2024 షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెల్సిందే. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.అలాగే రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: