వినడానికి చోద్యంగా ఉన్నా, మీరు విన్నది అక్షరాలా నిజం. అవునండీ, పురుషాంగం ఉండాల్సిన చోట లేకుండా అతని చేతిపై మొలిచింది. ఏమిటి? మీరు నమ్మడం లేదా? కావాలంటే ఫుల్ స్టోరీ చదవండి.. అపుడు మీరే అంటారు, ఇది వాస్తవం అని! అవును, వైద్యరంగం చాలా డెవలప్ అయ్యింది. అక్కడా ఇక్కడా కాకుండా చేతిపైన పురుషాంగాన్ని మొలిపించి మగతనాన్ని గెలిపిస్తున్నారు మరి! అసలీ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే మీరు ఈ మిస్టరీ కధనం చదవాల్సిందే!

విషయం ఏమిటంటే, బ్రిటన్‌కి చెందిన 45 ఏళ్ల మాల్కమ్ డొనాల్డ్‌ రక్తంలో ఘోరమైన ఇన్ఫెక్షన్ చేరిన కారణంగా అతని పూర్వ పురుషాంగం పూర్తిగా పాడయిపోయింది. ఈ స్థితిని మెడికల్ పరిభాషలో "పెరీనియం" అని అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా 2014లో అతని పురుషాంగం కోల్పోవలసి వచ్చింది. ఫలితంగా వృషణాలు మాత్రమే చివరకు మిగిలాయి. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లిన మాల్కమ్ కి చేదు వార్తే ఎదురైంది. అక్కడి డాక్టర్స్ తాము చేయగలిగింది ఏమీ లేదని చేతులెత్తేశారు. అదే సమయంలో ఫ్యామిలీ డాక్టర్, ప్రొఫెసర్ డేవిడ్‌ రాల్ఫ్‌‌కి ఈ విషయం తెలిసింది.

విషయం ఏమంటే? డేవిడ్ లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆస్పత్రిలో పురుషాంగ మార్పిడిలో ఎక్స్‌పర్ట్. దాంతో మాల్కమ్ ఆయన్ని కలిసి సిగ్గుపడకుండా విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. తరువాత ధైర్యం చెప్పిన ఆండ్రూ డేవిడ్... అతనికి కొత్త అంగాన్ని మొలిపిస్తాననీ, కాకపోతే... దాన్ని చేతిపైన మాత్రమే మొలిపించగలనని చెప్పారు. ఇక వేరే అవకాశం లేదని తెలిసిన మాల్కమ్ ఎక్కడో ఒక చోట మొలిపించి, పుణ్యం కట్టుకోవలసిందిగా ప్రార్ధించాడు. ఈ నేపథ్యంలో పురుషాంగం పూర్తిగా తయారవ్వడానికి రెండేళ్లు పడుతుందని చెప్పారు ఆండ్రూ. సరే అన్న మాల్కమ్ దానికి రూ.50 లక్షలు కావాలని తెలిసి, ప్రభుత్వాన్ని కోరగా... ఆ డబ్బును ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. కట్ చేస్తే... ట్రీట్‌మెంట్ మొదలైంది. పురుషాంగం లేకుండా బాధపడుతున్న ఆండ్రూ వార్డెల్‌‌కి ప్రత్యేక బయోనిక్‌ పురుషాంగం అమర్చి ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసాడు డేవిడ్. అవును, మనం ఇలాంటి విషయాలు తెలుసుకొని తీరాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా... వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల్ని గ్రహించగలం.

మరింత సమాచారం తెలుసుకోండి: