మీ పిల్లల్ని కేంద్రీయ విద్యాలయంలో చేర్పించాలనుకుంటున్నారా, అయితే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) చదవాలని అనుకుంటారు. ఎందుకంటే ఈ స్కూళ్లలో తక్కువ ఫీజుతో మంచి చదువు అందుతుంది. ప్రైవేట్ స్కూళ్లలాగా వేలకు వేలు ఫీజులు ఉండవు. అందుకే చాలా కుటుంబాలకు కేవీలు బెస్ట్ ఆప్షన్.

ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. టెన్త్ వరకే కాదు, ఇంటర్ కూడా ఇక్కడే చదివించొచ్చు. కానీ సీట్లు తక్కువగా ఉండటంతో అడ్మిషన్ దొరకడం మాత్రం కొంచెం కష్టమే. సెలక్షన్ ప్రాసెస్ పారదర్శకంగా ఉంటుంది కాబట్టి, చాలామంది పేరెంట్స్ ప్రతి సంవత్సరం అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటారు.

కేంద్రీయ విద్యాలయాలు స్పెషల్ ఎందుకంటే.. దేశవ్యాప్తంగా 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇవి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ద్వారా నడుస్తాయి. ఈ స్కూళ్లలో రెగ్యులర్ స్టడీస్‌తో పాటు స్కిల్ బేస్డ్ లెర్నింగ్‌పై కూడా ఫోకస్ పెడతారు. చదువుతో పాటు స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్‌కు కూడా ఇక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తారు.

కేవీలు అన్నీ ఒకే సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఫాలో అవుతాయి. దీనివల్ల ఉద్యోగాల వల్ల తరచూ ట్రాన్స్‌ఫర్ అయ్యే పేరెంట్స్ పిల్లలు చదువు మధ్యలో ఆగిపోకుండా కంటిన్యూ చేయొచ్చు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా కేవీలు ఉన్నాయి. ఖాట్మండు, మాస్కో, టెహ్రాన్‌లో కూడా కేవీలు ఉన్నాయి. అక్కడ ఉండే ఇండియన్ పిల్లలు కూడా ఈ స్కూళ్లలో చదువుకోవచ్చు.

• వయసు ఎంత ఉండాలి?

క్లాస్ 1లో అడ్మిషన్ కావాలంటే, పిల్లలకు ఏప్రిల్ 1 నాటికి కనీసం 6 సంవత్సరాలు నిండి ఉండాలి.

తక్కువ వయసు ఉన్న పిల్లల అప్లికేషన్స్‌ను రిజెక్ట్ చేస్తారు.

9, 11 తరగతుల్లో చేరడానికి మాత్రం వయసు పరిమితి లేదు.

• అడ్మిషన్ ప్రాసెస్ & ముఖ్యమైన పాయింట్స్

అప్లికేషన్‌లో చిన్న తప్పులు దొర్లినా రిజెక్ట్ చేసేస్తారు. అందుకే పేరెంట్స్ ఫామ్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం అయితే ఏప్రిల్ 1 నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు.

• తెలుగు రాష్ట్రాల్లో కేవీలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం 71 కేవీలు ఉన్నాయి. ఏపీలో 36 స్కూళ్లు ఉంటే, తెలంగాణలో 35 స్కూళ్లు ఉన్నాయి.

• ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?

కేంద్రీయ విద్యాలయాలు మొదట ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలకు, ఆ తర్వాత సాధారణ ప్రజల పిల్లలకు కూడా అడ్మిషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: