
మంత్రి నారా లోకేష్ విద్యా శాఖా మంత్రి గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఏపీలో విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యా వ్యవస్థలో లోకేష్ చేస్తోన్న సంస్కరణల కు ప్రజల నుంచి .. విద్యావేత్తల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో నే ఏపీలో విద్యా రంగంలో కీలకమైన ఇంటర్ లోనూ మార్పుల తో పాటు సమూల ప్రక్షాళనకు లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థి జీవితం లో ఇంటర్ అనేది కీలకం. ఇంటర్ విద్యా వ్యవస్థ అనేది విద్యార్థి దశను ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పక్కర్లేదు.
ఈ క్రమం లోనే ఇక ఈ యేడాది నుంచి ఏపీ లో ఇంటర్ విద్య సరికొత్తగా ఉండబోతోంది. 2025 - 26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను సరికొత్త గా చూడబోతున్నాం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రతి ఏటా జూన్ 1న ప్రారంభ మయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24 తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆ పై మే నెలా ఖరు వరకు సెలవులు ఉంటాయి.
ఇక జూన్ 2 న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభం .. కొనసాగింపు లో మార్పుల తో పాటు సిలబస్ తో పాటు సబ్జెక్టుల ఎంపిక తదితర విషయాల లోనూ మార్పులు .. చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.