
ఇది సహజమైన కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. బ్యూటర్ మిల్క్+ జీలకర్ర + పుదీనా, మజ్జిగలో జీలకర్ర పొడి, పుదీనా ఆకులు, ఉప్పు కలిపి తాగితే గ్యాస్ సమస్య తక్షణమే తగ్గుతుంది. ఇది శరీరాన్ని చల్లబరచి, అసిడిటి సమస్యను కూడా నియంత్రిస్తుంది. నిమ్మరసం + బ్లాక్ సాల్ట్. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ కలిపి తాగితే గ్యాస్ తక్షణమే తగ్గుతుంది.ఇది అసిడిటిని నియంత్రించడంతో పాటు కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది. పుదీనా టీ, వేడి నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసి టీలా తయారుచేసి తాగితే, జీర్ణక్రియ మెరుగవుతుంది.ఇది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్‌ను వెంటనే తగ్గిస్తుంది.
ఎండు ద్రాక్ష నీరు, రాత్రి 10-12 ఎండు ద్రాక్ష నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇది ప్రాకృతిక కూలింగ్ డ్రింక్. హింగు + గోరు వెచ్చని నీరు. కొంచెం హింగు పొడి గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే వెంటనే ఉపశమనం.ఇది పొట్టలో గ్యాస్ గట్టిపడకుండా అడ్డుకుంటుంది. మామిడికాయ రసం. ఇది శరీరాన్ని చల్లబరచి, జీర్ణక్రియను మెరుగుపరిచి, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. వేసవిలో తరచుగా తాగితే బాగా ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత 5-6 సోంపు గింజలు లేదా 1/2 tsp అజ్వైన్ + నిమ్మరసం తీసుకుంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. త్వరగా ఉపశమనం కావాలంటే బ్లాక్ టీ లేదా జీలకర్ర టీ తాగడం మంచిది.