ఏపీలో ఇంట‌ర్ విద్య‌లో స‌మూల మార్పుల‌కు కూట‌మి స‌ర్కారు శ్రీకారం చుట్టింది. జూనియ‌ర్ క‌ళాశాల‌ల ప‌నివేళ‌ల మార్పుల‌తో పాటు పీరియ‌డ్ల‌ను పెంచింది. ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి సీబీఎస్ఈ సిల‌బ‌స్ ను అమ‌లు చేస్తోంది. కాలేజీల పనిదినాలను 222 నుంచి 235కు పొడిగించింది. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకునేలా  సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింది. వచ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఫిబ్ర‌వ‌రిలోనే ప‌రీక్ష‌లు పూర్తిచేసేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. నీట్, జేఈఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా సిలబస్‌లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి చెందిన సిలబస్, ప్రశ్నపత్రాల కూర్పు, అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఇప్ప‌టికే తరగతులు ప్రారంభించింది.   314 రోజులకుగాను 235 పనిదినాలు, 79 సెలవులను కూడా ప్రకటించింది.


నూత‌న విద్యా సంవ‌త్స‌రం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించింది. ఇంట‌ర్ సెకండియ‌ర్ విద్యార్థుల‌కు ఇప్పటికే త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ఈనెల 24 నుంచి జూన్ ఒక‌టి వ‌ర‌కు విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వుల‌ను ప్ర‌క‌టించ‌నుంది. గ‌తం కంటే భిన్నంగా ఏప్రిల్‌లో త‌ర‌గ‌తులు ప్రారంభించి నూత‌న విధానానికి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది.

 
షెడ్యూల్ ఇదే...
ఏప్రిల్‌1 న ప్రారంభ‌మైన ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ త‌ర‌గ‌తులు ఈనెల 23వ‌ర‌కు కొన‌సాగుతాయి. 24 నుంచి  జూన్1 వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు. జూన్‌ 2న కళాశాలలు పునః ప్రారంభ‌మ‌వుతాయి. జూలై 17 నుంచి 19 వరకు యూనిట్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 18 నుంచి 20 వర కు యూనిట్-2 పరీక్షలు, సెప్టెం బరు 15 నుంచి వరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. అలాగే సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5వరకు దసరా సెలవులు, అక్టోబరు 22 నుంచి 24 వరకు యూనిట్-3 పరీక్షలు, నవంబరు 17 నుంచి 22 వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు, జనవరి 15 నుంచి 20వరకు ఫ్రీఫైనల్-1 పరీక్షలుం టాయి. ఇకపోతే 2026 జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 21 నుంచి 28 వరకు ప్రీఫైనల్-2, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి చివరివారం నుంచి మార్చిలో థియరీ పరీక్షలు నిర్వహించి మార్చి 18న అకడమిక్ సంవత్సరాన్ని ముగించేలా షెడ్యూల్ ప్రకటించారు.

 
కొత్త సిలబస్...
2012-13లో రూపొందించిన ప్రథ మ సంవత్సరం సైన్స్, 2014-15లో ఆర్ట్స్, 2018-19లో లాంగ్వేజ్ సిలబస్ ను ఈ ఏడాది నుంచి మార్పు చేశా రు. 2025-26లో ప్రథమ సంవత్సరా నికి కొత్త సిలబస్ ను రూపొందించా రు. ద్వితీయ సంవత్సరం సిలబస్ ను వచ్చే ఏడాది నుంచి మార్చనున్నారు. ప్రథమ, ద్వితీయభాషలతో పాటు ప్రస్తుతం ఉన్న నాలుగు సబ్జెక్ట్ సైన్స్, ఐదు సబ్జెక్ట్స్ ఆర్ట్స్ విభాగాలను ప్రక్షాళన చేశారు. అలాగే ప్రథమభాషగా ఇంగ్లిష్ ను అందరికీ వర్తింపచేస్తుండగా, ద్వితీయభాష కోసం ప్రస్తుతం ఉన్న పది భాషల స్థానంలో అద నంగా సైన్స్ ఆర్ట్స్ గ్రూపుల్లో మరో 14 సబ్జెక్ట్‌ల‌ను ప్రతిపాదించి, ఎంపిక చేసుకునే అవకాశం విద్యా ర్థికి కల్పించారు.   ఎంపీసీ గ్రూపు విద్యార్థులు అదనంగా బయాలజీని, బైసీపీ వారు అదనంగా గ‌ణితాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. దీని ద్వారా ఎంబైపీసీ చదువుకుని జేఈఈ, నీట్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది.

 
ప్రశ్నపత్రాల్లోనూ మార్పు...
ఈ ఏడాది నుంచి ప్రశ్నపత్రాల కూర్పు లోనూ మార్పులు చేశారు. మ్యాథ్స్-ఏ, బీలుగా ఉన్న రెండు పేపర్లను కలిపి ఒకే పేవర్గా, బోటనీ, జువాలజీలను కలిపి బయాలజీ పేపర్గా మార్చారు. వీటితోపాటు అదనపు సబ్జెక్ట్స్ విధానాన్ని ప్రవేశపెడుతుం డడంతో ఆయా సబ్జెక్లలోని మార్కులను పునర్విభజన చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2.4,8 మార్కుల విధానాన్ని కొనసాగిస్తూనే ప్రతి సబ్జెక్ట్ దాదాపు 10శాతం ఒక్కమార్కుల ప్రశ్నలు ఉండేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిం చనున్నారు.   గతంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న ఏడు పీరియడ్ల విధానానికి స్వస్తి పలికారు. ఇక నుంచి అన్ని జూనియర్ కళాశాలల్లో కూడా ఉదయం 9 గంట‌ల‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 పీరియడ్లు ఉండేలా మార్పు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: