ఈశ్వర్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. తొలి చిత్రంలో మూగ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తన నటనను మరింత మెరుగు పరుచుకోవాలనుకున్నారు. అలాగే దర్శకత్వ శాఖలో కూడా తన ప్రతిభ చాటాలనుకున్నాడు. కానీ అప్పటికే హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో ఉద్యోగ రీత్యా బీఏ యాక్టింగ్, ఎం.ఎఎ మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధనా ఉపాధ్యాయుడిగా కొనసాగాడు.


దీంతో ఈశ్వర్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా తగిన పాత్ర కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు ది డీల్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడి గా అనేక ప్రయాణాలు చేసి రంగస్థలంపై ఎన్నో విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసి తెలుగులో మొట్ట మొదటి నాటక త్రయం ప్రతాప రుద్ర నాటకాన్ని మూడు భాగాలుగా ప్రదర్శించడం జరిగింది. నాటక రంగంపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్లో పాల్గొని నాటక అధ్యాపకులుగా నటన, దర్శకత్వంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చి పేరు తెచ్చుకున్నాడు.


అంతే కాక నాటక రంగంలో ఎన్నో ప్రయోగాలకు నాంది పలుకుతూ తన కళలకి గుర్తింపుగా  రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డును గెలుచుకున్నారు. తనకున్న అపార అనుభవంతో ది డీల్ సినిమాను రూపొందించారు. ఈ సినిమాని అక్టోబరు నెలలో దసరా పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులుగా సరికొత్త అనుభవాన్నిఅందించబోతున్న హను కోట్ల కి జన్మదిన శుభాకాంక్షలు.



సిటిడెల్ క్రియేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ది డీల్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా హీరో, దర్శకుడు డాక్టర్ హను కోట్ల పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా  మూవీ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మొత్తం హైదరాబాద్ లో కొంత.. మలేసియా లో చిత్రీకరించామని.. మలి భాగాన్ని మొత్తం మలేసియాలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.


ఈ చిత్రంలో హీరోయిన్ గా చందన, ధరణి ప్రియా నటించగా, రఘు కుంచె, రవి ప్రకాశ్, మహేశ్‌ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు. కెమెరా సురేందర్ రెడ్డి, సంగీతం ఆర్ ఆర్ ధ్రువన్, ఎడిటర్ శ్రవణ్ కటికనేని సాంకేతిక నిపుణులుగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: