వారం రోజుల తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి. బంగారం సామాన్యుడికి బహు దూరం అయ్యింది. మన పిచ్చి కానీ బంగారం ధర పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి ? సామాన్యులం.. ప్రస్తుతం కొనగలమా? ఒకప్పుడు ధరలు పెరిగిన మళ్ళి తగ్గేవి కానీ ఇప్పుడు ఆలా కాదు.. భారీగా అంటే భారీగా పెరుగుతాయి.. ఏమాత్రం తగ్గవు ఈ బంగారం ధరలు.
అయితే బంగారం ధర ఈ ఒక్క సంవత్సరంలోనే 25 శాతం ధర పెరిగింది. అందుకే సామాన్యులు బంగారం అంటే భయపడుతున్నారు. అయినప్పటికీ ఏదైనా పండగ అంటే చాలు బంగారం కొనేస్తారు. మన భారతీయులు. ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 10 రూపాయిల పెరుగుదలతో 42,760 రూపాయలకు చేరింది.
అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 38,230 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర మాత్రం స్థిరంగా నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిలు తక్కువ 49,990 రూపాయిల వద్ద స్థిరంగా చేరింది.
అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో ప్రస్తుతం బంగారం ధరలు ఉన్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.