అవును.. మీరు చదువుతుంది నిజమే.. కరోనా వల్లే బంగారం ధర భారీగా పతనమైంది. ఎంత దారుణంగా పతనమైంది అంటే.. బహుశా మీరు కూడా నమ్మలేకపోవచ్చు. అంత దారుణంగా బంగారం ధరలు పడిపోయాయి. ప్రస్తుతం బంగారం ధరలు.. కరోనా వైరస్ కారణంగా భారీగా దిగొచ్చాయి.
ఎందుకంటే బంగారం డిమాండ్ అంతర్జాతీయంగా భారీగా పడిపోయింది. కారణం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే చైనాలో ప్రజలు బయటకు రావడానికి.. నిత్యావసర వస్తువులు కొనడానికే భయపడుతున్నారు. అలాంటిది ఇంకా బంగారం ఏం కొంటారు.
అందుకే బంగారం కొనుగోలు దారులు అటు వైపు దేశాలు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో బంగారం డిమాండ్ భారీగా తగ్గిపోయింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే నేడు శనివారం బంగారం ధరలు ఎంత తగ్గాయి అంటే.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై దాదాపు 400 రూపాయిల తగ్గుదలతో 41,980 రూపాయలకు చేరింది.
అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై కూడా దాదాపు 350 రూపాయిల తగ్గుదలతో 38,430 రూపాయలకు చేరింది. ఇంకా వేడి ధర అయితే మరి దారుణంగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా 530 రూపాయిల తగ్గుదలతో 48,340 రూపాయలకు చేరింది. దీనికి కారణం.. అంతర్జాతీయంగా బంగారంపై డిమాండ్ భారీగా తగ్గటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. భవిష్యేత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.