బంగారం ధరలు రోజుకు ఒకలా ఉంటాయి అంటే ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా కారణంగా అన్నిటికంటే ఎక్కువ ఈ బంగారం ధరలే పెరిగాయ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు పూర్తిగా నష్టాల్లో ఉండటం కారణంగా.. ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
దీంతో నేడు సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 43,290 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 39,680 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధర భారీగా పతనమయ్యింది. దీంతో నేడు కేజీ వెండి ధర 690 రూపాయిల తగ్గుదలతో 39,880 రూపాయిలకు చేరుకుంది.
కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఈ బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏమైతేనేం.. చివరికి బంగారం సామాన్యులకు అందనంత ఎత్తులోకి చేరింది. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.